తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజావేదిక లక్ష్యం' - మహబూబ్‌నగర్‌ జిల్లా తాజా వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

Minister Srinivas Goud participating in a praja vedika program in Mahabubnagar
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజావేదిక లక్ష్యం

By

Published : Feb 4, 2021, 5:32 PM IST

ప్రజా సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజావేదికను ప్రవేశపెట్టినట్లు... మంత్రి శ్రీనివాస్​ గౌడ్ తెలిపారు. ప్రతి గురువారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర జిల్లాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సైతం స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని ఆయా జిల్లాల సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని అన్నారు. ప్రజావేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామని... వెంటనే పరిష్కారం కాని వాటికి సమయం ఇస్తున్నట్లు చెప్పారు. కిందటి వారం నిర్వహించిన కార్యక్రమంలో 58 దరఖాస్తులు రాగా.. వాటిని తక్షణమే పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రైతుల ఉద్యమానికి తెలంగాణ అన్నదాతల మద్దతు: ఈటల

ABOUT THE AUTHOR

...view details