మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలో అలివేలుమంగ కల్యాణోత్సవానికి అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డకా ఆలయాలు అభివృద్ధి జరుగుతున్నాయని, అన్ని మతాలకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. దేవాలయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘతన తమదేనని పేర్కొన్నారు.
అలివేలుమంగ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి - mahabubnagar district latest news today
రాష్ట్ర బడ్జెట్‌లో ఆలయాల పునరుద్ధరణకు, ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. మన్యంకొండలో అలివేలుమంగ కల్యాణోత్సవంలో భాగంగా మంత్రి పాల్గొన్నారు.
అలివేలుమంగ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి
కేసీఆర్‌కు ఈ ప్రాంతంపట్ల ప్రత్యేక అభిమానం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత తీర్చిదిద్దుతామన్నారు. స్వామి దయతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తై ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కోరుకున్నామని తెలిపారు.
ఇదీ చూడండి :అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్