మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి డయాగ్నస్టిక్ కేంద్రం మంజూరు చేసినందున రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో 500 పడకలతో పాటు.. ఆక్సిజన్, వెంటిలేటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు సమానంగా మహబూబ్‌నగర్ ఆసుపత్రిని తీర్చిదిద్ది హైదరాబాద్ వెళ్లే పని లేకుండా.. సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.
Minister Srinivas Goud: సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నస్టిక్ కేంద్రాలు మంజూరు చేయడంపై.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్‌తో పాటు, గద్వాలకు వీటిని మంజూరు చేశారని చెప్పారు.
సోమవారం నుంచి ఈ కేంద్రం ప్రారంభమవుతుందని చెప్పారు. రోగనిర్ధరణ కోసం జరిగే పరీక్షలకు అయ్యే ఖర్చును పేద ప్రజలు భరించలేరని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నిస్టిక్ కేంద్రాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్‌తో పాటు, గద్వాలకు వీటిని మంజూరు చేశారని చెప్పారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 57 పరీక్షలు నిర్వహిస్తారని.. ముఖ్యంగా షుగర్, 2డీ ఎకో, సీటీస్కాన్‌తో పాటు.. కరోనా నిర్ధరణ పరీక్షలను అత్యాధునిక యంత్రాలతో నిర్వహిస్తారని స్పష్టం చేశారు. గంటకు 400 నుంచి 800 రిపోర్టులు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రంలో పనిచేసేందుకు అవసరమైన పాథాలజీ, రేడియాలజిస్టులు ఇతర నిపుణులను త్వరలోనే నియమించుకోవడం జరుగుతుందని వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని.. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీనిచ్చారు.