తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు! - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కడియం దొంగతనం

సెల్ఫీల కాలం నడుస్తోంది. వీఐపీలకు ఈ తాకిడి మరీ ఎక్కువ. అభిమానులు సెల్ఫీలు అడగడం... సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం... ఓ సెల్ఫీనే కదా పంపేయ్ అనడం ప్రజాప్రతినిధులకు అలవాటే! అయితే.. అలా సెల్ఫీ సమయంలోనే మంత్రి గారి చేతి కడియమే కొట్టాశాడో ఘరానా దొంగ! అదెలా జరిగిందో చదివేద్దామా...

అభిమానుల పోటీ.. కడియం లూటీ
అభిమానుల పోటీ.. కడియం లూటీ

By

Published : Feb 14, 2020, 8:35 AM IST

Updated : Feb 14, 2020, 10:28 AM IST

మహబూబ్​నగర్​లోని దేవరకద్రలో ఓ పెళ్లికి వెళ్లాడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్. బంధువుల వివాహమే కావడం వల్ల అందరితో సరదాగా గడిపారు. అంతలోనే కొంతమంది యువకులు వచ్చి సెల్ఫీ కావాలని అడిగారు. మంత్రి కాదనలేక సరేన్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ... సెల్ఫీలిచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే.. చేతికి కడియం లేదు. ఎంతో ఇష్టంగా ధరించే కడియం కనిపించకపోవడం వల్ల మంత్రి కాస్త నిరాశకు గురయ్యారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది.

ఇవీ చూడండి:గోదావరి జలాల్ని 100 శాతం వాడాలి: కేసీఆర్​

Last Updated : Feb 14, 2020, 10:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details