తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచంలో 'మేడ్ ఇన్ తెలంగాణ' మార్మోగుతోంది: మంత్రి

మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తొలుత పారిశుద్ధ్య కార్మికులకు టీకా వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రపంచంలో 'మేడ్ ఇన్ తెలంగాణ' మార్మోగుతోంది: మంత్రి
minister-srinivas-goud-launch-covid-vaccination-program-in-mahabubnagar-district-government-hospital

By

Published : Jan 16, 2021, 12:06 PM IST

Updated : Jan 16, 2021, 12:51 PM IST

మహబూబ్​నగర్​లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

ప్రపంచదేశాలను వణికించిన మహమ్మారి కరోనా నివారణకు వ్యాక్సిన్‌ రావడం శుభపరిణామమని.. అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ ప్రారంభ కాలంలో దేశం నిర్మానుష్యమై పరిస్థితులు భయంకరంగా ఉండేవన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఆయన... వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు టీకా వేశారు. ప్రపంచదేశాలకు 40శాతానికి పైగా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌ నుంచే సరఫరా కావడం గర్వకారణమన్నారు.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 17కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 4, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 4 చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 2, నారాయణపేటలో 3 వ్యాక్సికేషన్ కేంద్రాలున్నాయి.

ఇదీ చదవండి:కొవాగ్జిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Last Updated : Jan 16, 2021, 12:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details