మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
వెంకటేశ్వరస్వామి పట్టువస్త్రాల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి - మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు
మన్యంకొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి గ్రామోత్సవం, పట్టువస్త్రాల ఊరేగింపులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉండి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ దేవస్థానం గతంలో నిరాదరణకు గురైందన్నారు.
వెంకటేశ్వరస్వామి పట్టువస్త్రాల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి
మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవం, పట్టువస్త్రాల ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం గతంలో నిరాదరణకు గురైందన్న ఆయన... ఐదేళ్లలో తమ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించిందని తెలిపారు.
ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..
TAGGED:
మహబూబ్నగర్లో మన్యంకొండ