రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందిపడొద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో మూడు రైతుబజార్లను ప్రారంభించారు. నిత్యవసర సరుకులు, కూరగాయలు ఇళ్ల వద్దకే చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి కోరారు.
ఇళ్ల వద్దకే నిత్యవసరాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్ - minister srinivas goud latest news
నిత్యవసర సరుకులు, కూరగాయలు ఇళ్ల వద్దకే చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మూడు రైతు బజార్లను ప్రారంభించారు.
ఇళ్ల వద్దకే నిత్యావసరాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
శుక్రవారం నుంచి రేషన్ షాపుల వద్ద బియ్యం ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలు కావాల్సిన వారు కలెక్టర్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'