చట్టాల్లో సవరణ లేని కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్ పోస్టుల ద్వారా భర్తీ చేసిన పదిమంది, నూతన డిప్యూటీ తాహసీల్దార్లకు మంత్రి నియామక ఉత్తర్వులను అందించారు.
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పనిచేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు నిజాయితీగా పనిచేసి పేదవారికి అండగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతన డిప్యూటీ తాహసీల్దార్లు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్ పోస్టుల ద్వారా భర్తీ చేసిన పది మందికి నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఉద్యోగాన్ని కూడా సొంత పనిలా భావించి శ్రద్ధ కనబర్చితే ఉద్యోగంలో రాణిస్తారని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులకు సాధ్యమైనంత వరకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని, పని భారం తక్కువగా ఉండేలా చూసి సహకరించాలన్నారు. మిగిలిన పోస్టులను కూడా త్వరగతిన భర్తీ చేస్తామన్నారు. 32 మంది నూతన డిప్యూటీ తాహసీల్దారులతో పాటు సంక్షేమ శాఖ ద్వారా 10 మంది దివ్యాంగుల పోస్టులకు గాను ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..