తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆలోచించి మాట్లాడండి.. రాష్ట్రానికి భాజపా ఏం చేసింది?'

భాజపాను ప్రజలు నమ్మే పరిస్థితి లేనందునే తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

minister srinivas goud
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

By

Published : Mar 7, 2021, 2:20 PM IST

Updated : Mar 7, 2021, 4:56 PM IST

'రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినందుకు సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతారా..? ఎందుకు పెడుతారు' అంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పరోక్షంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడ్డారు. మహిళలను అవమానిస్తూ మాట్లాడితే సహించేది లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణకు ఏం చేసింది.?

పాలమూరును అభివృద్ధి చేస్తుంటే.. అందుకు విరోధులుగా ప్రతిపక్షాలు మారాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీగా తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలి కానీ... దిగజారిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

'ఆలోచించి మాట్లాడండి.. రాష్ట్రానికి భాజపా ఏం చేసింది?'

ఇదీ చదవండి:ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి

Last Updated : Mar 7, 2021, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details