తెలంగాణ

telangana

ETV Bharat / state

srinivas goud: లాక్​డౌన్ అమలుతీరును పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాజా వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ అమలు తీరును మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అనంతరం పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పండ్లు పంపిణీ చేశారు.

minister srinivas goud examined lockdown implementation in mahabub nagar
లాక్​డౌన్ అమలుతీరును పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : May 28, 2021, 7:24 PM IST

కొవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలొడ్డి పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ అమలు తీరును ఐజీ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్​లతో కలిసి పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అనారోగ్యానికి గురైతే పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖ ఆధునీకరణ, సంక్షేమ నిధుల పెంపు, హోంగార్డుల వేతనాల పెంపు సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు.

లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించి పండ్లు అందించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కేంద్రంలోని పోలీసు పికెట్లు, సహా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి జాగ్రత్తలు చెప్పి, వారికి పండ్లు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా కరోనా నిబంధనలను పాటించడం, ఐసోలేషన్ సెంటర్​లను ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సహకరించుకోవడం ఆదర్శనీయమన్నారు.

ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details