తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయవాదులకు హెల్త్​కార్డులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పాల్గొని న్యాయవాదులకు హెల్త్​కార్డులు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

minister srinivas goud distributed health cards to advocates in mahabubnagar district
న్యాయవాదులకు హెల్త్​కార్డులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​

By

Published : Jun 19, 2020, 8:58 PM IST

దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కొరకు వంద కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్​ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాదులకు మంత్రి హెల్త్‌కార్డులను అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా న్యాయస్థానాలు పని చేయకపోవడం వల్ల పలువురు జూనియర్‌ న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. గౌరవ మర్యాదలతో న్యాయవాదులు మంచి పేరు తెచ్చుకోవాలని.. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగు చర్యలు తీసుకుని ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

అంతకు ముందు మహబూబ్‌నగర్ పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. పురపాలిక పరిధిలో సుమారు కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధురానగర్ కాలనీలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువకు, భగీరథ కాలనీలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, మురికి కాలువకు శంకుస్థాపన చేశారు. న్యూ బాలాజీనగర్‌లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, మురికి కాలువకు శంకుస్థాపన చేశారు. 74 లక్షల రూపాయల వ్యయంతో రామ్ మందిర్ చౌరస్తాలో నిర్మించిన సీసీ రోడ్డును, 21 లక్షల రూపాయల వ్యయంతో కొత్త చెరువు రోడ్డులో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. వీది వ్యాపారులకోసం జిల్లా కేంద్రంలో వారం రోజుల్లో రుణ మేళాను ఏర్పాటు చేసి డీసీసీ బ్యాంకు ద్వారా 70 పైసల వడ్డీతో 60 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ పార్సిల్‌ కొరియర్, కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details