తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆపదలో అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - మహబూబ్​నగర్​ లేటెస్ట్ అప్డేట్స్

పేద కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. వారిని ఆదుకోవడానికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. మహబూబ్​నగర్​, హన్వాడ మండలాల్లో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

minister srinivas goud distribute cmrf funds in mahaboobnagar district
ఆపద కాలంలో అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Oct 30, 2020, 7:23 AM IST

Updated : Oct 30, 2020, 8:36 AM IST

ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. వైద్యపరంగా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించి... ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని చెప్పారు. మహబూబ్​నగర్, హన్వాడ మండలాల్లోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. భూత్పూర్​లో పంచవటి స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్​నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం

Last Updated : Oct 30, 2020, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details