గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం బాధ్యత సర్పంచ్లు, ప్రత్యేక అధికారులదేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పక్షం రోజుల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే... సొంతపార్టీ వారైనా ఉపేక్షించం' - Minister Srinivas Goud Latest News
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే... సొంత పార్టీ నేతలపైనా చర్యలకు వెనుకాడబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
!['ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే... సొంతపార్టీ వారైనా ఉపేక్షించం' Minister Srinivas Goud](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6284393-589-6284393-1583251738350.jpg)
Minister Srinivas Goud
పంచాయతీకి అవసరమైన భూములివ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట భూములు కొనుగోలు చేయాలన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా సర్పంచ్లు పనిచేయాలని సూచించారు. సర్పంచ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ఆదేశించారు. అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలని... తద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలన్నారు.
'ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే... సొంతపార్టీ వారైనా ఉపేక్షించం'
ఇదీ చూడండి :'వైరాలో అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం'