తెలంగాణ

telangana

ETV Bharat / state

పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్ - శ్రీనివాస్​ గౌడ్

షాద్​నగర్​తో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ప్రకటించారు.

పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్

By

Published : Aug 18, 2019, 5:37 PM IST

మహబూబ్​నగర్ జిల్లా ఫరూక్​నగర్ మండలం కిషన్​నగర్ గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు షాద్​నగర్​ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తివుతుందని మంత్రి పేర్కొన్నారు. చాకిరి వ్యవస్థను, దోపిడీలను నివారించి అన్ని వర్గాల మంచి కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ABOUT THE AUTHOR

...view details