తెలంగాణ

telangana

By

Published : Sep 6, 2020, 10:40 PM IST

ETV Bharat / state

'రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకారం అందించాలి'

మహబూబ్​నగర్ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్ల వెడల్పు, రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు సంపూర్ణ సహకారాలు అందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. పట్టణంలోని గడియారం కూడలిలో జరుగుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులను కలెక్టర్​తో కలిసి పరిశీలించారు.

minister spoke on road development in mahaboobnagar
'రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకారం అందించాలి'

మహబూబ్​నగర్‌‌ జిల్లా కేంద్రంలోని గడియారం కూడలిలో జరుగుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రకాలుగా సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జంక్షన్ల వద్ద నిబంధనల ప్రకారం విస్తరణ చేస్తున్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ పనులకు అడ్డంకులు కల్పించవద్దని మంత్రి కోరారు.
మహబూబ్​నగర్ ప్రజలు పట్టణ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని, కొత్తగా ఏర్పాటు అయ్యే కాలనీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రహదారులను ఆక్రమించకుండా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అక్రమ లే అవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details