తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల ఆర్థికాభివృద్ధికై కుట్టుమిషన్ల పంపిణీ: మంత్రి నిరంజన్​ - మహబూబ్​నగర్​లో మంత్రి నిరంజన్​రెడ్డి కుట్టుమిషన్ల పంపిణీ

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​లోని నిరుపేద మహిళలకు ఆయన మిషన్లను వితరణ చేశారు. మహిళలకు తమ కాళ్లపై తాము ఎదగాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుందని, అవకాశాలు కల్పిస్తే ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని మంత్రి పేర్కొన్నారు.

minister singireddy niranjan reddy distribution free sewing machines to the poor women in mahabubnagar
మహిళల ఆర్థికాభివృద్ధికై కుట్టుమిషన్ల పంపిణీ: మంత్రి నిరంజన్​

By

Published : Aug 9, 2020, 9:39 AM IST

సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబ్​నగర్​ పట్టణంలోని 100 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పంపిణీ చేశారు. మహిళలు ఇంటి వద్ద తమ పనులను తాను చూసుకుంటూ, కుట్టు వృత్తితో స్వయం ఉపాధిని పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. అందరూ అవకాశాల కోసం చూడకుండా, వాటిని అందిపుచ్చుకొని ముందుకు సాగే నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న, కుట్టు శిక్షణలో వినూత్న నైపుణ్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. మార్కెట్లో ఉన్న డిమాండ్లకు అనుగుణంగా మెలకువలు నేర్చుకుంటే కుటుంబ పోషణతో పాటు ఆర్థిక అభివృద్ధికి ముందడుగు పడినట్లు అవుతుందని తెలిపారు. 2018 ఎన్నికల్లో గ్రామాల పర్యటన సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అవసరమైన నిరుపేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details