తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్​‌ - minister ktr speech

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రారంభించారు.

MINISTER KTR TALK ABOUT TELANGANA DEVELOPMENT IN JADCHERLA, MAHABUBNAGAR DISTRICT
ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్​‌

By

Published : Apr 14, 2021, 3:59 PM IST

Updated : Apr 15, 2021, 6:40 AM IST

ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్​

పట్టణాలు, పల్లెలు ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

కావేరమ్మపేటలో రూ.4.2 కోట్లతో కావేరమ్మ పేట నుంచి గంగాపూర్​ వరకు నిర్మించిన బీటీ రహదారి, రూ.2 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ ఇన్ట్రా విలేజ్​ పథకం, రూ. 3 కోట్ల 98 లక్షలతో నిర్మించిన నల్లచెరువు మినీ ట్యాంక్​ బండ్​ను ఆయన ప్రారంభించారు. రూ.15 కోట్లతో పట్టణంలో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్​ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా సంక్షోభ సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని కేటీఆర్​ స్పష్టం చేశారు.

బేరీజు వేసుకోండి..

గతంతో పోలిస్తే జడ్చర్ల, కావేరమ్మపేట, బాదేపల్లి మూడు ప్రాంతాలు కలిసి పట్టణం రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారాయన్నారు. పోలేపల్లిలో సెజ్​ ఏర్పాటుతో జడ్చర్ల పట్టణంలో రహదారులు, వ్యాపార సముదాయాలు గణనీయంగా పెరిగిపోయాయన్నారు. తెలంగాణ రాక ముందు పరిస్థితులతో ప్రస్తుతాన్ని బేరీజు వేసుకుని తెరాసను ఆదరించాలని కోరారు.

కొత్త రేషన్​ కార్డులు, పింఛన్లు..

రూ.200 పింఛన్​ను రెండు వేల రూపాయలకు పెంచామని.. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని కేటీఆర్​ గుర్తు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు జారీచేస్తామని వెల్లడించారు. 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం, పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.

విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు..

వెయ్యి గురుకుల పాఠశాలల ఏర్పాటు, 18 లక్షల విద్యార్థులకు పోస్ట్​ మెట్రిక్​ స్కాలర్​షిప్​లు, బోధనా రుసుముల కింద రూ.12,800 కోట్లు, అంబేడ్కర్​ ఓవర్సీస్ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సహాయం లాంటి ఎన్నో ప్రయోజనాలు విద్యార్థులు పొందుతున్నారని గుర్తుచేశారు.

ఇంకా చెయ్యాలి..

జడ్చర్ల పట్టణంలో 1500 రెండు పడక గదుల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఇంకా ఇళ్లు అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పట్టణంలో ఆధునిక మార్కెట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వంటి పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్​ పేర్కొన్నారు.

మహానగరంగా..

రాబోయే రోజుల్లో పట్టణ ప్రణాళిక కింద.. నిరంతరం నిధులు వస్తాయని.. ఎలాంటి పనులు కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. మహబూబ్​నగర్, జడ్చర్ల, భూత్పూర్​ కలిపి మహా నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్‌

Last Updated : Apr 15, 2021, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details