రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 82 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా.. కేవలం హైదరాబాద్‌లోనే లక్ష ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం కంటే.. రాష్ట్రంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లు దేశానికే గర్వకారణమన్నారు.
కరోనా వేళా... సంక్షేమాన్ని ఆపలేదు: మంత్రి కేటీఆర్ - మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 18వేల కోట్ల రుపాయలతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో నూతనంగా నిర్మించిన 660 రెండుపడక గదుల ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
రాష్ట్రంలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇళ్లు దేశానికే ఆదర్శం: కేటీఆర్
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. ఆదాయం రాకపోయినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. కరోనా విషయంలో ఎవ్వరు బయపడవద్దని.. 98 శాతం మంది కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల వరకు టీకా కూడా వచ్చే పరిస్థితి లేదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించాలని సూచించారు.
ఇదీ చూడండి:వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది: కేటీఆర్