తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నసాగర్​లో మంత్రుల పర్యటన... ప్రత్యేక పూజలు - జోగులాంబ ఆలయానికి పయనమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ దేవస్థానానికి వెళ్తున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు మహబూబ్​నగర్ జిల్లా అన్నసాగర్​ గ్రామంలో పర్యటించారు. స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... రెండు పడక గదుల ఇళ్లను సందర్శించారు. అనంతరం జోగులాంబ ఆలయానికి పయనమయ్యారు.

minister indrakarn tour at annasagar in mahabubanagar district
అన్నసాగర్​లో మంత్రుల పర్యటన... ప్రత్యేక పూజలు

By

Published : Nov 7, 2020, 1:24 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ దేవస్థానానికి వెళ్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డికి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి వచ్చిన మంత్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి నమూనాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చూపించి... నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అన్న సాగర్​లోని రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు సందర్శించారు. ఆల వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి రఘుపతి రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులంతా జోగులాంబ గద్వాల దేవస్థానానికి పయనమయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details