తెలంగాణ

telangana

ETV Bharat / state

పౌష్టికాహార కిట్‌తో తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా: హరీశ్‌రావు - హైదరాబాద్ వార్తలు

KCR Nutrition Kit Scheme: విపక్షాలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ విద్వేష రాజకీయాలు చేస్తున్నాయని, మంత్రి హరీశ్​రావు విమర్శించారు. తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కేసీఆర్‌ ఆలోచిస్తుంటే, జనం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేతలు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని మంత్రి హరీశ్​రావు కామారెడ్డిలో శ్రీకారం చుట్టగా, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

KCR Nutrition Kit Scheme
KCR Nutrition Kit Scheme

By

Published : Dec 21, 2022, 10:51 PM IST

పౌష్టికాహార కిట్‌తో తల్లీబిడ్డలు ఆరోగ్యానికి భరోసా: హరీశ్‌రావు

Scheme of Nutrition Kit for Pregnant Women: గర్భిణిల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గర్భిణీలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తున్నారు. 50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు.. కామారెడ్డిలో శ్రీకారం చుట్టారు.

పోషకాహర కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కేజీ ఖర్జూర, ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి అందిస్తున్నారు. రాష్ట్రంలో లక్షా 25వేల మందికి లబ్ధి చేకూరనుందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. తల్లీ, బిడ్డా క్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, మంత్రి హరీశ్​రావు విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

బీజేపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. గద్వాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు న్యూట్రిషన్‌ కిట్లను ప్రారంభించారు.

"ఈ న్యూట్రిషన్ కిట్​లో నెయ్య, ఖర్జూర, ఐరన్ సిరప్, పప్పులు ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటిన్ డైట్​ని మీకు ఇస్తా ఉన్నాం. దయచేసి మీరు దీనిని తప్పకుండా స్వీకరించాలి. మీ కోసం ఇస్తున్నటువంటిది. దీని విలువ రెండు వేల రూపాయలు. అంగన్​వాడీలో పాలు కోడి గుడ్డుతో మీకు అన్నం పెట్టే కార్యక్రమం పెట్టాం. దానితోపాటు న్యూట్రిషన్ కిట్​ని ఇస్తున్నాం." -మంత్రి హరీశ్​రావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details