క్రిస్మస్ వేడుకలను పేద, ధనిక తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకోవడం కోసం తెరాస ప్రభుత్వం పేదలకు దుస్తులను పంపిణీ చేస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డితో కలిసి చిన్న చింతకుంట మండలంలో ఏర్పాటు చేసిన మినీ క్రిస్మస్ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.
ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఘనంగా మినీ క్రిస్మస్ - తెలంగాణ వార్తలు
చిన్న చింతకుంట మండలంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డితోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దుస్తులను వారు పంపిణీ చేశారు.

ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఘనంగా మినీ క్రిస్మస్
మత పెద్దలతో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలు, యువతులు కీర్తనలు ఆలపించారు. ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇదీ చూడండి:ఒత్తిళ్లకు యువత బలి : పరువు తీసి వేధిస్తున్న లోన్ యాప్స్