తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత హిందూ-ముస్లింల మధ్య సామరస్య భావం పెంపొందే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు లోక కల్యాణం కోసమే పాటు పడ్డాయని.. భిన్నత్వంలో ఏకత్వమనే స్ఫూర్తి పంథాను తాము ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
'హిందూ ముస్లింలు సామరస్యంగా మెలగాలి' - మహబూబ్‌నగర్ లో మిలాద్-ఉన్-నబీ
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మిలాద్-ఉన్-నబీ ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని... ర్యాలీని ప్రారంభించారు. హిందూ ముస్లింల మధ్య సామరస్య భావం పెంపొందే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
'హిందూ ముస్లింలు సామరస్యంగా మెలగాలి'
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జరుపుతున్న వేడుకల్లో.. ప్రవక్త నామస్మరణతో వీధులన్నీ మారుమోగాయి.
మత పెద్దల నేతృత్వంలో వేలాది మంది యువత.. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమైక్యత శిబిరం వద్ద ముస్లింలకు.. పలువురు శుభాకాంక్షాలు తెలియజేశారు.
Last Updated : Nov 11, 2019, 8:13 AM IST