తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు వైద్య పరీక్షలు - medical tests to mahabubnagar police

కరోనా మహమ్మారి నిర్మూలనలో నిర్విరామంగా పని చేస్తున్న జిల్లా పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మహబూబ్​నగర్​ ఎస్పీ రెమా రాజేశ్వరి చర్యలు చేపట్టారు.

medical tests to mahabubnagar police
పోలీసులకు వైద్య పరీక్షలు

By

Published : Apr 28, 2020, 3:59 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అహర్నిషలు కృషి చేస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్‌షైన్ ఆసుపత్రుల్లో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు. మే 1వ తేదీ వరకూ జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తానికి వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details