తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు ఎంపీపీ ఎన్నిక వాయిదా - Mbnr

మహబూబ్​నగర్ మండల ప్రజా పరిషత్ ఎన్నిక వాయిదా పడింది. సకాలంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగకపోవడం వల్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

ఎంపీపీ ఎన్నిక వాయిదా

By

Published : Jun 7, 2019, 5:36 PM IST

మహబూబ్ నగర్ మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక వాయిదా పడింది. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలలోపు కో- ఆప్షన్ సభ్యుని ఎంపికకు నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఉదయం10 గంటల 50 నిమిషాలకు కో-ఆప్షన్ సభ్యుడిగా కోటకదరకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నామినేషన్ దాఖలు చేశారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడం వల్ల రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచన మేరకు మహబూబ్​నగర్ మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

పాలమూరు ఎంపీపీ ఎన్నిక వాయిదా

ABOUT THE AUTHOR

...view details