మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొని కరోనా నివారణలో తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ... జిల్లా ప్రజలు సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వారి స్ఫూర్తిని చాటుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రధాన పశువుల సంతల్లో దేవరకద్ర సంత ఒకటి. రూ. కోటికి పైగా వ్యాపారం జరిగే ఈ సంతలో తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే పశువుల వ్యాపారులు, రైతులు క్రయవిక్రయాలు జరుపుతారు. 73 ఏళ్లుగా జరుగుతున్న ఈ అంగడి... కరోనా ప్రభావంతో ప్రజలు లేక నిర్మానుష్యంగా కనబడుతోంది.