తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు - సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ, ఇఫ్ట్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ, ఇఫ్ట్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

MAY DAY CELEBRATIONS IN DEVARAKADRA
ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు

By

Published : May 1, 2020, 8:03 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సీపీఐ ఎంల్ న్యూ డెమోక్రసీ, ఇఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరించారు.

అనంతరం కార్మికుల విప్లవ గీతాలను ఆలపించారు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్​డౌన్​తో కార్మికలోకం తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వారందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

ABOUT THE AUTHOR

...view details