షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో నారాయణగౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కి ప్రముఖుల పరామర్శ - Mahaboobnagar District News
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. శ్రీనివాస్‌గౌడ్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రిని పరామర్శించిన వారిలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు, సినీ నటులు సుమన్, శ్రీకాంత్ ఉన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కి ప్రముఖుల పరామర్శ
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు, ఎంపీ వెంకటేశ్ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి ఉన్నారు. సినీ నటులు సుమన్, శ్రీకాంత్ సైతం శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి:పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్