తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 10:31 PM IST

ETV Bharat / state

'భాజపా, కాంగ్రెస్, తెరాసలు వాగ్దానాలకే పరిమితమయ్యాయి'

ఎస్సీ వర్గీకరణను సుసాధ్యం చేస్తామని కాంగ్రెస్, భాజపా, తెరాసలు వాగ్దానాలకే పరిమితమయ్యాయని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తీసుకు రావడానికే సాగర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు.

Manda Krishna Madiga meeting with MMRPS affiliates
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అనుబంధ సంఘాలతో మంద కృష్ణ మాదిగ సమావేశం

ఎస్సీ వర్గీకరణను సుసాధ్యం చేస్తామని భాజపా, కాంగ్రెస్, తెరాసలు వాగ్దానాలకే పరిమితమయ్యాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్​లో అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు.

రాజ్యాధికారమే ధ్యేయం..

ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కేలా చైతన్యం తీసుకు రావడానికే నాగార్జున సాగర్ ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ పోటీ చేయనుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్​గా.. రాష్ట్ర ప్రజలకు తామేంచేశామో, ఏం చేయబోతున్నామో చెప్పి ఓట్లు అడుగుతామన్నారు.

ఇతర పార్టీలూ మా తరహాలోనే ఓట్లు అడగాలి. డబ్బు, మద్యం, అధికారాన్ని వినియోగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసినట్లే. ఎస్సీ వర్గీకరణ పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మార్పీఎస్ పోరాటానికి అణగారిన వర్గాలు మద్దతు పలకాలి.

-మందకృష్ణ మాదిగ

ఇదీ చూడండి:చెరుకు సుధాకర్ గెలుపునకు కృషి చేస్తా: రాజగోపాల్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details