మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వాగులు పొంగి పొర్లుతూ.. రోడ్లపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. హన్వాడ మండలం గొండ్యాల వాగు దాటేందుకు ప్రయత్నించిన కుర్వ రాములు అనే వ్యక్తి గల్లంతయ్యాడు.
హన్వాడలో భారీ వర్షం.. వాగులో వ్యక్తి గల్లంతు - మహబూబ్ నగర్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా పరిధిలోని అనేక చెరువులు అలుగులు పారుతూ… వాగులు పొంగి రోడ్లపైకి నీళ్లు చేరుకుంటున్నాయి. హన్వాడ మండలం గుండాల గ్రామ సమీపంలో వాగు దాటేందుకు యత్నించిన వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
![హన్వాడలో భారీ వర్షం.. వాగులో వ్యక్తి గల్లంతు man missing in Hanwada Vaagu in Mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8948458-206-8948458-1601125372935.jpg)
హన్వాడలో భారీ వర్షం.. వాగులో వ్యక్తి గల్లంతు
రాములును కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు.