మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్నే పోచయ్య కూతురు ఇటీవలే మరణించింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చేందుకని తండ్రి పోచయ్య ద్విచక్రవాహనంపై మహబూబ్ నగర్ బయలుదేరాడు. మార్గమధ్యలో ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి మృతి చెందాడు.
ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి వ్యక్తి మృతి - మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంట
ఇటీవలే కూతురు మృతి చెందింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చేందుకని ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆమె తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి వ్యక్తి మృతి
విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కూతురు చనిపోయిన కొంతకాలానికే తండ్రి కూడా మరణించడంతో గ్రామంలో విషాధఛాయలు అలముకున్నాయి.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స