ఒకే పేర్లు... నకిలీ పత్రాలతో సరికొత్త మోసం Fake Passbook: భూయజమాని పేరు, తనపేరు ఒక్కటే కావడాన్ని అవకాశంగా తీసుకుని నకిలీ దస్త్రాలతో (Fake Documents) కోటిన్నర విలువైన రెండెకరాల భూమిని కాజేసే యత్నాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చాకచక్యంగా అడ్డుకున్నారు. మిడ్జిల్ తహసీల్దార్ (Midzil MRO) కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బాదేపల్లి పాతబజారుకు చెందిన రైతు మహ్మద్ జావీద్ 2013లో మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు సర్వేనెంబరు 46లో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో టైటిల్ డీడ్, పాస్ పుస్తకం జారీ అయింది.
ఎలా మారిందో...
ధరణి అమల్లోకి వచ్చిన తర్వాతా భూమి జావీద్ పేరుమీదే ఉంది. ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల ఈ-పాస్ బుక్ రాలేదు. కలెక్టర్ కార్యాలయంలో సమస్యను వివరిస్తే మీసేవా కేంద్రంలో ఆధార్ కార్డు ఇచ్చి... వేలి ముద్ర వేయాలని (Fake Documents) చెప్పారు. ఈనెల 25న జడ్చర్లలోని మీసేవా కేంద్రానికి జావీద్ వెళ్లి ప్రయత్నించారు. అప్పటికే ఆధార్ నంబరు, ఫొటోమారి మహబూబ్‌నగర్‌కు చెందిన జావీద్ పేరిట భూమి ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ఖంగుతిన్న జావిద్...
రెండెకరాల భూమిని అమ్మేందుకు నవంబర్ 27న స్లాట్ బుక్ చేసినట్లూ నమోదై ఉంది. విషయం తెలుసుకున్న భూయజమాని జావీద్ ఖంగుతిన్నారు. విషయాన్ని తహసీల్దార్‌కు ఆధారాలతో వివరించారు. స్లాట్ బుక్ చేసినందున రిజిస్ట్రేషన్ (Fake Documents)కోసం వస్తారని భావించి మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాపుకాశారు. ఫొటోలో ఉన్న వ్యక్తి... ఆ భూమిని కొనుగోలు చేసే వ్యక్తి, సాక్షులు, మధ్యవర్తి దస్త్రాలతో సహా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. వెంటనే వారి వద్ద నుంచి దస్త్రాలు లాక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
పట్టించుకోని అధికారులు...
కొత్త పట్టాదార్ పాస్ పుస్తకం కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని భూ యజమాని జావీద్ వాపోయారు. పథకం ప్రకారమే ముఠా అక్రమానికి పాల్పడినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్లే నకిలి వ్యక్తిని గుర్తించగలిగామని మిడ్జిల్ తహసీల్దార్ శ్రీనివాసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: