సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆస్పత్రులను సందర్శించనున్నారు. కరోనా రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది కొరత, మౌలిక వసతులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు.
నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎల్పీ బృందం పర్యటన - Mallu bhatti vikramarka Tour
జిల్లాలోని ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యల పరిశీలనకు బుధవారం నుంచి కాంగ్రెస్ శాసనసభాపక్షం పరిశీలనను చేపట్టింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించునున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యేనాటికి పర్యటన ముగిసేలా సీఎల్పీ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.
నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎల్పీ బృందం పర్యటన
ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు వాటితో ప్రజలకు కష్టకాలంలో సేవలు అందించాలని అన్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. ఈ విషయాలను సభ దృష్టికి తీసుకువచ్చేందుకు తాను జిల్లాలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ నాయకులతో పలు అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష
Last Updated : Aug 31, 2020, 7:20 AM IST