తెలంగాణ

telangana

Mahbubnagar Rains News : వెంటాడిన వర్షాలు.. కూరగాయ రైతులు కుదేలు.. అప్పటివరకు ధరలు తగ్గనట్లే!

By

Published : Jul 28, 2023, 10:46 PM IST

Mahbubnagar Rains Crop Loss : కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వానలకు చేలల్లో నీరు చేరి వేరుకు గాలి అందక ఎక్కడికక్కడ తోటలు కుళ్లిపోతున్నాయి. చీడపీడల బెడద అధికమైంది. తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయలు అమ్మకం సంగతి పక్కన పెడితే.. కనీసం ఇంట్లో వండుకునేందుకు కావాలన్న కూరగాయలూ దక్కని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న కూరగాయల తోటలు తీసివేసి కొత్త పంటలు వేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే తప్ప కూరగాయల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉండదు.

Heavy Rain in Mahabubnagar
Heavy Rain in Mahabubnagar

భారీ వర్షాలకు దెబ్బతిన్న కూరగాయల పంటలు.. తినడానికి దొరకని పరిస్థితి!

Heavy Rain in Mahbubnagar : ఉమ్మడిమహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్నవర్షాలుకూరగాయల రైతులకు తీరనినష్టాన్నికలిగిస్తున్నాయి. తెరపివ్వకుండా పడుతున్న వర్షాలతో పంట కుళ్లిపోయి వచ్చిన దిగుబడిని అమ్ముకునే వీలులేక రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. ముఖ్యంగా టమాట, వంకాయ, బెండలాంటి కూరగాయలు, ఆకుకూరల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం రానున్న రోజుల్లో కూరగాయల ధరలపైనా పడనుంది. బహిరంగ మార్కెట్‌లో కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉన్నా.. ఆశించిన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు. వరుసవర్షాలతో అవకాశంలేక కూరగాయలు తీసివేసి కొత్తపంటవేసేందుకు రైతులుసన్నద్దమవుతున్నారు.

Mahabubnagar Rains Today : సాధారణంగా కూరగాయల సాగు ఏప్రిల్‌, మే మాసాల్లో మొదలు పెట్టి మూడు నుంచి నాలుగు నెలలలో రైతులు దిగుబడి తీస్తారు. ఈ సారి ఏప్రిల్‌, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జూన్‌ మాసంలో వర్షాలు లేకపోయినా.. బోరు బావుల ద్వారా కూరగాయల పంటల్ని కాపాడుతూ వచ్చారు. జూలై మొదటి వారం నుంచి వానలు మొదలయ్యాయి.

Farmers Preparing New Crop : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వానలు కూరగాయల తోటలకు సానుకూలంగా ఉంటాయని రైతులు ఆశించారు. కాని.. తెరపి లేకుండా అన్ని మండలాల్లో ముసురు వానలు కురువడం వల్ల కూరగాయల రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మరి కొన్ని రోజులు వానలు ఇలానే కొనసాగుతాయన్నా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తోటలను పూర్తిగా వదిలేస్తున్నారు. ఈ కారణంగా కూరగాయల దిగుబడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణంగా పడిపోనుంది.

Vegetables Price Hike Due to Heavy Rains : కొద్దిరోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు.. కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు .ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టమాట, వంకాయ, పచ్చి మిరుప, బెండ, దొండతో పాటు పాలకూర, కొత్తిమీర, గోంగూర వంటి ఆకుకూరలు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‌ఉండటంతో సాగు చేసిన పంటలపై రైతులు లాభాలు ఆశించారు. కాని.. పరిస్థితి తెరపిలేని వర్షాలతో తారుమారైంది. వానలకు చేలళ్లో నీరుచేరి వేరుకు గాలి అందక ఎక్కడికక్కడ తోటలు కుళ్లీపోతున్నాయి. కాసిన పూత కూడ కుళ్లీ.. రాలిపోతుంది. చీడపీడల బెడద అధికమైంది. తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమాట, వంకాయ, చిక్కుడు, దొండ, బెండ.. తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. అమ్మకం సంగతి పక్కన పెడితే కనీసం ఇంట్లో వండుకునేందుకు కావాలన్న కూరగాయలు దొరకని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

Mahabubnagar Floods 2023 : వానల కారణంగా కూరగాయ తోటలు దెబ్బతిన్న ప్రభావం రైతుబజార్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు నిండుగా కనిపించే రైతుబజార్‌లు ప్రస్తుతం కూరగాయలు లేక వెలవెలబోతున్నాయి. స్థానికంగా పండించే టమాట, వంకాయ, బెండకాయలాంటి కూరగాయలు, ఆకుకూరలు రైతుల వద్ద దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి దెబ్బతిన్న పంటను రైతుబజార్లకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఇప్పటికే ఉత్పత్తి లేక టమాట ధర కిలో 180 వరకు పలుకుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేక మిగిలిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details