Mahbubnagar Maternal Child Health and Nutrition Department :ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకప్పటి కేంద్రం మహబూబ్‌నగర్. అప్పట్లో ఎలాంటి వైద్యసేవలు పొందాలన్నా.. అంతా మహబూబ్నగర్కే వచ్చేవాళ్లు. ఇప్పటికీ మెరుగైన వైద్యం, ప్రసవాల కోసం మిగిలిన ఐదు జిల్లాల ప్రజలు మహబూబ్‌నగర్ ఆసుపత్రి(Mahabubnagar Hospital)కే వస్తుంటారు. మెరుగైన వైద్య సేవలకు కేంద్రమైన మహబూబ్‌నగర్ జిల్లా.. మాతాశిశు ఆరోగ్యం(Maternal Child Health) విషయంలో మాత్రం కొత్తగా ఏర్పడిన జిల్లాల కంటే వెనకబడుతోంది.
తాజాగా ఆగస్టులో విడుదల చేసిన ఎంహెచ్ఎన్ సూచికల్లో మహబూబ్‌నగర్ జిల్లా 16వ స్థానానికే పరిమితమైంది. నూతనంగా ఏర్పడిన జోగులాంబ గద్వాల జిల్లా రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. నాగర్ కర్నూల్ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 73 శాతం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే.. అందులో 42 శాతం శస్త్రచికిత్సల ద్వారానే ప్రసవాలు జరిగాయి. దీన్ని 35 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
PHCs in Telangana 2023 : తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ... ఇంటి దగ్గరలోనే వైద్యం
Mahabubnagar District Ranks 16th in MHN Indicators : పట్టణంలోని కుమ్మరివాడి పట్టణఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ కేంద్రం పరిధిలో 29 ప్రసవాలు జరిగితే అందులో 18 ప్రైవేటులో జరిగాయి. జిల్లా స్థాయిలో జడ్చర్ల, రాజాపూర్, మోతీనగర్, పాత పాలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(Palamuru Primary Health Centres) తక్కువ స్కోరుతో వెనకబడి ఉన్నాయి. అమిస్తాపూర్, బూర్గుపల్లి, శేరివెంకటాపూర్, బాదేపల్లి, నెల్లికొండి ఆరోగ్య ఉపకేంద్రాలు మంచి పనితీరు ప్రదర్శించడంలో వెనకబడ్డాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కోరు సాధించడంలో వెనకబడుతోంది. ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినా.. వివిధ రకాల కారణాలతో ప్రైవేటుకు వెళ్తున్నారని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు.
Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్ కేంద్రాలు'