ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా చికిత్స అందిస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని ప్రభుత్వం విస్మరిస్తోందని మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది ఆరోపించారు. కరోనా వచ్చిన వైద్య సిబ్బందిపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రాష్ట్రంలో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మౌన ప్రదర్శన - మహబూబ్నగర్ జిల్లా వార్తలు
కొవిడ్ చికిత్సలను అందిస్తున్న తమకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదని మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు మౌన ప్రదర్శన చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మౌన ప్రదర్శన
ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది వైద్య సిబ్బంది కొవిడ్ చికిత్స అందిస్తూ మృతిచెందితే.. వారికి ఆర్థిక సహాయం అందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించిలేదన్నారు. కరోనాతో మృతి చెందిన వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.