తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వాక్సిన్​ డ్రై రన్'​ - మహబూబ్​నగర్​ జిల్లా కరోనా టీకా సమాచారం

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు లేదా నాలుగు దశల్లో వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్​లాల్‌ అన్నారు. జిల్లాలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కోసం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

mahbubnagar additional collector said vaccine dry run according to central guidelines
'కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వాక్సిన్​ డ్రై రన్'​

By

Published : Jan 2, 2021, 2:32 PM IST

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ కొనసాగుతుందని మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్​లాల్‌ తెలిపారు. జిల్లాలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా అందించడం కోసం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

కరోనా టీకా అందించడం కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్​లాల్‌ తెలిపారు. రెండు కేంద్రాలను జిల్లా కేంద్రంలో, ఒక కేంద్రాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియపై కొనసాగుతున్న ఈ డ్రై రన్‌లో లబ్దిదారులను గుర్తించడం, రిజిస్త్రేషన్‌, వ్యాక్సినేషన్‌ ఇవ్వటం, అబ్సర్వేషన్‌లో ఉంచడం వంటి అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు లేదా నాలుగు దశల్లో అందరికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొవిడ్​ టీకా డ్రై రన్​

ABOUT THE AUTHOR

...view details