మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే నంబర్ 523లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. భూముల ధరలు పెరగటం వల్ల అసైన్డ్ భూములపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. 1989-90 నుంచి 2016 వరకు విడతల వారీగా పేదలకు, దివ్యాంగులకు కేటాయించిన భూములు అక్రమార్కులు కబ్జాకు పాల్పడ్డినట్లు గుర్తించారు. కొందరికి ఎలాంటి పట్టాలు లేకపోయినా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు.
బోగస్ పట్టాలపై విచారణ
దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో బోగస్ పట్టాదారులను గుర్తించేందుకు అధికారులు ఏఆర్‌ఐ, సర్వేయర్, సీనియర్ సహాయకుడు, వీఆర్వో, వీఆర్‌ఏలతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు గతంలో కేటాయించిన ఇంటిస్థలం పట్టా, ప్రస్తుతం నివాసం ఉన్నవారి ఆధార్‌కార్డు ఇతర ధ్రువీకరణ పత్రం తదితర అంశాలపై వివరాలు సేకరించారు.