కొవిడ్ వైరస్ ప్రాణాంతకమైంది కాదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. వైరస్ సోకిన వారి పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా బారినుంచి కొలుకుని తిరిగి విధుల్లో చేరుతున్న32 మంది పోలీస్ అధికారులపై పూలుజల్లి ఆహ్వానం పలికారు.
కొవిడ్ విజేతలను ఆహ్వానించిన ఎస్పీ - కవిడ్ జయించిన పోలీసులకు మహబూబ్నగర్లో ఆహ్వానం
కరోనా వ్యాధిని జయించి తిరిగి విధుల్లో చేరిన పోలీస్ ఆధికారులకు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పూలతో ఆహ్వానం పలికారు. ధైర్యంగా ఉంటే సకల సమస్యలను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.
![కొవిడ్ విజేతలను ఆహ్వానించిన ఎస్పీ mahabubnagar-sp-welcome-to-corona-warriors-with-flowers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8512188-636-8512188-1598070783921.jpg)
విధుల్లో చేరుతున్న పోలీసులను ఆహ్వానించిన ఎస్పీ
వైరస్ నివారణకు మానసిక ధైర్యం అత్యంత ప్రధానమైందన్నారు. ఇక నుంచి ప్రతిఒక్కరు యోగా, ప్రాణాయామం వంటివి తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం కరోనాను జయించిన సిబ్బందికి కొవిడ్ వారియర్ సర్టిఫికెట్స్ అందజేశారు.