మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో లారీ దూసుకెళ్లి ఇంటి గోడను ఢీకొట్టిన ఘటనలో మృతులను పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటకు చెందిన రఫీయుద్దిన్ కాగా... ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురైన వారు నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్కు చెందిన మల్లయ్య, వనపర్తి జిల్లా గోపాలపేట మండలం మున్ననూరుకు చెందిన హన్మంతుగా పోలీసులు ప్రకటించారు.
బీభత్సం సృష్టించిన లారీ.. అక్కడికక్కడే ఇద్దరు మృతి - mahabubnagar latest news today
మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ లారీ వేగంగా దూసుకెళ్లి ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వారి వివరాలను పోలీసులు వెల్లడించారు.
జడ్చర్ల హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న దగ్గర ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకొచ్చింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షల నిమిత్తం తరలించారు. వివిధ రకాల ఆధారాల పరిశీలన అనంతరం మృతుల వివరాలను వెల్లడించారు. రహదారి నిర్మాణ పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి :తందూరి చాయ్... రుచితో పాటు ఆరోగ్యం