తలసేమియా రోగులు సహా.. అత్యవసర వైద్యానికి రక్తం అవసరం. ఈ నేపథ్యంలో రక్తదాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో రక్త నిధి నిల్వల పరిస్థితి ఏమిటి? రక్తం కావాలన్నా... రక్తం ఇవ్వాలన్నా ఏం చేయాలి? తదితర విషయాలపై మహబూబ్ నగర్ ఇండియర్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నటరాజ్‌తో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
'తలసేమియా బాధితులు మమ్మల్ని సంప్రదించండి' - తలసేమియా రోగుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ
"ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 152 మంది తలసేమియా బాధితులు ఉన్నారు. సుమారు 200 యూనిట్ల రక్తం నిల్వలు మా వద్ద ఉన్నాయి. ఏప్రిల్ 14న మూడు రక్తశిబిరాలు ఏర్పాటు చేసి సేకరించాం. త్వరలో మరో రెండు రక్తశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రక్తదాతల కోసం ప్రత్యేక వాహనాలు కేటాయించాం. రక్తదానం కోసం సంప్రదించాల్సిన నంబర్ 08542- 246225." -నటరాజ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
'తలసేమియా బాధితులు మమ్మల్ని సంప్రదించండి'