తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్టాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కనుల పండువగా మన్యంకొండ జాతర - mahabubnagar manyamkonda venkateswara swamy temple
మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవ కార్యక్రమానికి ... పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని.. గరుడ వాహన సేవ, స్వామివారి రథోత్సవం కనులపండువగా సాగింది. కొండపై నుంచి స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నిర్వహిస్తూ... గరుడ వాహనంలో భక్తుల మధ్యకు తీసుకువచ్చారు. ఈ వేడుకలకు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:షాద్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం