తెలంగాణ

telangana

ETV Bharat / state

‌'రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి' - mahabubnagar collecter

రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను రక్షించిన వారమవుతామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లాలోని అయ్యప్ప కొండపై ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

Mahabubnagar District Collector inaugurated the blood donation camp
‌'రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి'

By

Published : Dec 26, 2020, 11:16 AM IST

రక్తదానం చేసేందుకు యువత సహా దాతలందరూ ముందుకు రావాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు పిలుపునిచ్చారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ లోని అయ్యప్ప కొండపై గల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను రక్షించిన వారమవుతామని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. అయ్యప్ప భక్తులు సుమారు 200 యూనిట్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తలసేమియా వ్యాధి గ్రస్తులు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల అందులో కొందరినైనా కాపాడవచ్చనని పేర్కొన్నారు. అనంతరం అయప్ప దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, సభ్యులు జగపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నిలకడగా రజనీకాంత్​ ఆరోగ్యం... నేడు మరికొన్ని వైద్య పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details