తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం సేకరణలో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి' - Mahabubnagar collector Vebkarao news

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్​లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు తాలు, మట్టి పెల్లలు, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

'ధాన్యం సేకరణలో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి'
'ధాన్యం సేకరణలో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి'

By

Published : Dec 7, 2020, 7:52 AM IST

ధాన్యం సేకరణలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో 7,271 మంది రైతుల నుంచి 27,287 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్​లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో పొందుపర్చాలని.. ఎలాంటి జాప్యం చేయొద్దని కలెక్టర్ సూచించారు. ఐకేపీ సంఘాల ద్వారా 4,580 మంది రైతులతో 14,464 మెట్రిక్‌ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 3,016 మంది రైతులతో 11,997 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంస్‌ల ద్వారా 71 మంది రైతులతో 178 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 84 మంది రైతులతో 423 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. రైతులు తాలు, మట్టి పెల్లలు, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో తొలివిడతలో 70-75లక్షల మందికి టీకా

ABOUT THE AUTHOR

...view details