మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, ప్రత్యేక అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించారు.
ముందుగా రైతు వేదిక నిర్మించిన వారికి బహుమతి: కలెక్టర్ వెంకట్రావు - mahabubnagar collector on rythu vedika construction
రైతు వేదికల నిర్మాణాల్లో ఎలాంటి నాణ్యత లోపాలు జరగకుండా చూసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలో ముందుగా రైతు వేదికను నిర్మించిన వారికి నగదు బహుమతిని ఇస్తామని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు.
![ముందుగా రైతు వేదిక నిర్మించిన వారికి బహుమతి: కలెక్టర్ వెంకట్రావు mahabubnagar collector on rythu vedika construction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8693885-1064-8693885-1599320011338.jpg)
ముందుగా రైతు వేదిక నిర్మించిన వారికి బహుమతి: కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణంలో జాప్యం జరగకుండా ఉండేందుకు నిధులు కేటాయించడం, ఇసుక సరఫరాలో సమస్యలు చర్యలు చేపట్టాలని జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు వేదికల నిర్మాణంపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని.. నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ముందుగా రైతు వేదికను నిర్మించిన వారికి నగదు బహుమతిని ఇస్తామని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు.
ఇవీ చూడండి:ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు
TAGGED:
Collector_On_Raithu_Vedikalu