ఇష్టానుసారంగా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.
విద్యా శాఖ అధికారులతో కలెక్టర్ వెంకట్రావు సమావేశం - మహబూబ్‌నగర్ కలెక్టర్ సమావేశం
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.
![విద్యా శాఖ అధికారులతో కలెక్టర్ వెంకట్రావు సమావేశం mahabubnagar collector venkatrao meeting with education officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9200364-428-9200364-1602855229381.jpg)
జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించేటప్పుడు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిగా శుభ్రం చేయాలని వెంకట్రావు సూచించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమం గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని, పాఠశాలలో నషా ముక్త్ భారత్ క్లబ్ల్ను ఏర్పాటు చేయాలని, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే నష్టం గురించి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.
ఇదీ చదవండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి