కరోనా వ్యాప్తి నిర్ములనతో పాటు తీసుకుంటున్న చర్యలపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిని ఆయ ఇవాళ సందర్శించారు. వైరస్ నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ - Mahabubnagar Collector Venkat rao
కరోనా నిర్మూలనకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న చర్యలను, రసాయనాల చల్లే ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు.
![ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ Mahabubnagar Collector Venkat rao Inspected Government Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6559843-538-6559843-1585295312672.jpg)
ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆసుపత్రి ఆవరణలో అగ్నిమాపక యంత్రం ద్వారా చేపడుతున్న రసాయనాల పిచికారీని పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన విధుల్లో రసాయనాలను చల్లాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డు పరిసరాలతో పాటు అంబులెన్సులను రసాయనాలతో సిబ్బంది శుభ్రపరిచారు.
ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్