మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,05,190 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా 1,871 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, గర్భిణీలు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా వాహన సదుపాయం కల్పించనున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పాలనాధికారి రొనాల్డ్‌రోస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
'12 గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు' - ఎన్నికల ఏర్పాట్లు
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో ఈసారి ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కల్పించామని జిల్లా పాలనాధికారి రొనాల్డ్‌రోస్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా పాలనాధికారి