తెలంగాణ

telangana

ETV Bharat / state

Collector respond on Venture: ఆ ప్రాజెక్ట్​లో వెంచర్.. విచారణకు కలెక్టర్ ఆదేశం - పాలమూరు-రంగారెడ్డిపై కలెక్టర్ విచారణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై(palamur-rangareddy project) ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి జిల్లా పాలనాధికారి స్పందించారు. ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్ ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు.

tunnel venture
ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్

By

Published : Nov 17, 2021, 4:37 PM IST

Updated : Nov 17, 2021, 7:25 PM IST

మహబూబ్​నగర్ జిల్లా(mahaboob nagar) జడ్చర్ల మండలంలో పాలమూరు రంగారెడ్డి(palamur-rangareddy project) ఎత్తిపోతల పథకంలో సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్ ఏర్పాటుపై ఈనాడు,ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైనది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు విచారణకు ఆదేశించారు.

ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్

సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్(private venture) ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి సొరంగంపై వెంచర్లలో రోడ్లు, పిల్లల పార్కు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అక్కడే ఉన్న కుంటకు తూము, కాలువలు లేకపోవడాన్ని సైతం ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టరుకు నివేదిక ఇస్తామని నీటిపారుదల శాఖ ఈఈ కృష్ణ మోహన్ తెలిపారు.

ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో ప్రైవేట్ వెంచర్

బూరెడ్డిపల్లి శివారులో సొరంగం మీదుగా ఏర్పాటు చేసిన వెంచరు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీలో భాగంగా జడ్చర్ల పురపాలికలోని బూరెడ్డిపల్లి శివారు నుంచి సర్వే నంబర్లు 56, 57, 58, 102/11లో రెండు సొరంగాలు వెళ్తున్నాయి. 8.50 డయా మీటర్ల వెడల్పు గల రెండు సొరంగాలు ఈ సర్వే నంబర్ల పరిధి నుంచి ఉదండాపూర్‌ వరకు వెళ్తాయి. ఈ సొరంగాల కోసం ఆ సర్వే నంబర్లలోని 41 మంది వద్ద భూసేకరణ చేసి వారికి అవార్డు కూడా పాస్‌ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లినట్లే. అయితే సొరంగాలు నిర్మించిన ప్రాంతంలో ఓ సంస్థ వెంచరు వేసింది. ఏకంగా 69 ఎకరాల్లో మొత్తం 628 ప్లాట్లతో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించింది.

అందులో నుంచే సొరంగాలు వెళ్తుండటంతో స్థానిక గ్రామస్థులు ఈ ఏడాది మార్చిలో ఆందోళన చేసి అధికారులకు వినతి పత్రం అందించారు. దీంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సొరంగం వెళ్తున్న ప్రాంతం పైభాగాన్ని వెంచర్లలో భాగంగా రోడ్డు వేస్తున్నట్లు లే అవుట్లలో చూపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంచర్లలో రోడ్డు వేస్తున్నట్లు చూపించకూడదు. దీంతోపాటు సొరంగాల పైన వెంచర్లకు అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ రెవెన్యూ, సాగునీరు, పురపాలిక అధికారులు పోటీ పడి అనుమతులు ఇచ్చారు. భవిష్యత్తులో ఇక్కడ ఇళ్లు ఏర్పాటు చేసుకుంటే బోర్లు వేసుకోవాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలు ఉంటాయి. సొరంగంపై ప్రభావం చూపితే భారీ ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ వెంచరులోని మూడు ఎకరాల్లోనే మురుగోని కుంట ఉంది. దీన్ని కూడా లే అవుట్లో కలిపేసుకున్నారు. ఈ కుంటను సుందరీకరణ చేస్తామని అధికారుల వద్ద అనుమతి తీసుకుని సక్రమం చేసుకున్నారు. ఈ కుంటకు వెళ్లే దారులు మూసివేశారు. ఒకప్పుడు చుట్టుపక్కల పశువులు, మేకలు, గొర్రెలు ఈ కుంటలోనే దాహం తీర్చుకునేవి. పైగా కుంటకు ఉన్న పార్టు కాలువలు, తూములు పూడ్చి వేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

ఇదీ చూడండి:

Prlis Scheam: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలో పర్యావరణ ఉల్లంఘనలు

Last Updated : Nov 17, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details