అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కలెక్టర్ వెంకట్‌రావు - అక్రమ లే అవుట్ లపై కలెక్టర్
మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్ లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్‌రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కలెక్టర్ వెంకట్‌రావు
మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్. వెంకట్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ శాఖతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల, గ్రామ పంచాయతీల పరిధిలలో ప్రభుత్వ అనమతి లేకుండా ఏర్పాటు చేసినట్టు గుర్తించిన లేఅవుట్‌లలోని భూములలో క్రయవిక్రయాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.