తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలను పరిశుభ్రంగా మార్చుదాం: కలెక్టర్​ రోనార్డ్​రోస్​ - గ్రామాల్లో పర్యటించి అధికారులకు సూచనలు చేస్తున్నారు.

30 రోజుల ప్రణాళికపై మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనార్డ్​రోస్ దృష్టి సారించారు. గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా మార్చుదాం: కలెక్టర్​ రోనార్డ్​రోస్​

By

Published : Sep 26, 2019, 10:47 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనార్డ్​రోస్ 30 రోజుల ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కాటవరం సహా 14 మండలాల్లో పర్యటించారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ మలమూత్ర రహిత జిల్లాగా ప్రకటించిన సందర్భంగా గ్రామంలో మురికికాలువలు, వీధుల పరిశుభ్రత, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారం పనులను సమీక్షిస్తున్నారు. గ్రామసభలు, శ్రమదానం, డంపింగ్​యార్డు, శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు మెదలగు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 442 గ్రామపంచాయతీల్లో 2500 పాడుబడ్డ ఇళ్లను తొలగించారు. 440 గ్రామాల్లో శ్రమదానం పూర్తి చేశారు. 220కి పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్​యార్డ్​ల కోసం స్థలాలు గుర్తించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

గ్రామాలను పరిశుభ్రంగా మార్చుదాం: కలెక్టర్​ రోనార్డ్​రోస్​

ABOUT THE AUTHOR

...view details